Thursday 7 April 2011

CONGRESS WANTS CANDIDATES FOR CONTEST IN KADAPA

కడప ఉప ఎన్నికలలో పోటీ చేయుటకు 125 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కి అభ్యర్తులు దొరకటం లేదు.పోటీ చేయదలిచిన వారు కాంగ్రెస్ కార్యాలయం లో సంప్రదించండి.మొన్న జరిగిన MLC ఎన్నికలలో తే.దే.పా తో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ  అభ్యర్థి విజయం సాధించలేక చతికిల పడ్డారు.కావున ఇప్పుడు పార్టీ తరపున పోటీ చేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో ఎమీ పాలుపోని అధిష్టాన వర్గం తే.దే.పా,కు చెందినా వారిని పార్టీ లో చేర్చుకొని సీటు ఇవ్వాలని చూడటం ఆ ఘన చరిత్ర కలిగిన పార్టీ దిగ జారుడు తనానికి నిదర్సనం.
                               తెలుగు దేశం లోని కందుల సోదరులను కాంగ్రెస్ లో చేర్చుకొని పోటీ చేయించాలని ఆలోచిస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఎమీ చేయలేని స్థితి లో కలవర పడుతోంది.అంతటి ఘనమైన పరి అధ్యక్షులు మాత్రం వ్యతిరేకిస్తున్నాముఖ్య మంత్రి మాత్రం ఆ విధంగా చేయటానికే మొగ్గు చూపటం పలువురు కాంగ్రెస్ కార్యకర్తల్ని కలవరపెడుతున్న అంశం.ఐతే పైన పార్టీ నాయకులు కలిసింతగా పార్టీ కి ఎన్నో ఏళ్ళుగా సేవ చేస్తున్న కార్యకర్తలు కలుస్తారు అనుకోవడం అత్యాశే అవుతుంది.  
                               పార్టీ కి చెందినా కార్యకర్తల్ని సమాన్వయం చేయటం లో అధికార మరియు ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయి.కావున ఇలా తాత్కాలిక లాభాల కోసం పెట్టుకొనే రహస్య ఒప్పందాలు భవిస్యత్తులో ఎంతో నష్టాన్ని కలిగిస్తాయని సాక్శత్తూ మంత్రి బొత్స సత్య నారాయణ గారు వ్యాఖ్యానించడం గమనార్హం.కొసమెరుపు ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్ర   అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్య మంత్రి వినకపోవటం కాంగ్రెస్ లో ఉన్నప్రజాస్వామ్యానికి నిదర్సనంగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment